బిఆర్ఎస్ అభ్యర్ది ప్రచారం
On
విశ్వంబర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు బిఆర్ఎస్ పార్టీ నుండి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న వెన్నమల్ల అజయ్ పలు కాలనీలలో ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వెన్నమల్ల అజయ్ మాట్లాడుతూ ఇంతకి ముందు కూడా వార్డు కౌన్సిలర్ పోటీ చేసి ఈ వార్డు పరిధిలోని పలు కాలనీలలో చాలా అభివృద్ధి చేశానని అన్నారు . బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు .



