కోటక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ 15 ఏళ్ళు పూర్తి 

విశ్వంభర, హైదరాబాద్  : కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, కోటక్ మ్యూచువల్ ఫండ్ కోటక్ ఫ్లెక్సిక్యాప్ ఫండ్ తన 15 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు ప్రకటించింది. ప్రారంభం నుంచి ఈ పథకం 16.59 శాతం  సిఏజీఆర్ ను అందిస్తూ, వివిధ మార్కెట్ చక్రాల మధ్య కూడా స్థిరమైన బలమైన దీర్ఘకాలిక పనితీరును చూపించిందనీ  మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ షాతెలిపారు. కోటక్ ఫ్లెక్సిక్యాప్ ఫండ్ 15 సంవత్సరాలు పూర్తి చేయడం తమ కు  మాత్రమే కాదు తమను నమ్మి పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లందరికీ గర్వకారణం అన్నారు. ఫ్లెక్సిక్యాప్ ఫండ్ పెట్టుబడిదారులకు ముఖ్యమైన ఎంపికగా కొనసాగుతోందనీ, మార్కెట్లో ఎక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలి అనే నిర్ణయాలను అనుభవజ్ఞులైన పెట్టుబడి బృందం తీసుకుంటుందన్నారు. దీని ద్వారా పెట్టుబడిదారులు భారతదేశ వృద్ధిలో వివిధ రంగాల ద్వారా భాగస్వాములు కావచ్చనీ పేర్కొంది.

Tags: