చైనా మాంజాతో మరణిస్తే అది 'హత్యే'

చైనా మాంజాతో మరణిస్తే అది 'హత్యే'

నిషేధిత 'చైనా మాంజా'  విక్రయాలు, వాడకంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపారు. చైనా మాంజా కారణంగా ఎవరైనా మరణిస్తే, బాధ్యులపై సెక్షన్ 302 అంటే హత్య కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: నిషేధిత 'చైనా మాంజా'  విక్రయాలు, వాడకంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపారు. చైనా మాంజా కారణంగా ఎవరైనా మరణిస్తే, బాధ్యులపై సెక్షన్ 302 అంటే హత్య కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రజా భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, ఈ ప్రమాదకరమైన దారాన్ని రాష్ట్రం నుండి పూర్తిగా తుడిచిపెట్టాలని స్పష్టం చేశారు. 

లక్నోలో విషాదం.. యోగి ఆగ్రహం
ఈనెల 4న లక్నోలోని హైదర్‌గంజ్ ఫ్లైఓవర్‌పై బైక్‌పై వెళ్తున్న మహమ్మద్ షోయబ్ (33) అనే మెడికల్ రిప్రజెంటేటివ్ మెడకు చైనా మాంజా చుట్టుకుంది. ఆ దారం గొంతులో లోతుగా దిగబడటంతో తీవ్ర రక్తస్రావమై ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం, "నిషేధం ఉన్నప్పటికీ ఈ మాంజా ఇంకా మార్కెట్లో ఎలా లభ్యమవుతోంది?" అని అధికారులను నిలదీశారు.

Read More మార్షల్ ఆర్ట్స్‌లో అరుదైన ఘనత.. పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డ్..!!

కీలక ఆదేశాలు జారీ
మాంజా తయారీదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్ల నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేయాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. కేవలం అమ్మకాలే కాకుండా, గోడౌన్లలో నిల్వ ఉంచిన వారిపై, రవాణా చేసే వారిపై కూడా మెరుపు దాడులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఏ జిల్లాలోనైనా చైనా మాంజా విక్రయాలు జరిగితే స్థానిక పోలీస్ అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో చైనా మాంజా వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.