మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన
విశ్వంభర, నాగారం : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం ఈటూర్ గ్రామంలో అంచనా వ్యయం రూ.10 లక్షలతో మహిళా సంఘం నూతన భవనం నిర్మాణానికి శుక్రవారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళా సంఘాల అభివృద్ధి ద్వారానే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ నూతన భవనం మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, పావలా వడ్డీ రుణాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హరి కిషోర్ శర్మ, ఎంపీడీవో భీమ్ సింగ్, ఏపీవో వెంకన్న, సర్పంచ్ లు వంగూరీ దామోదర్, ఆకులబుచ్చిబాబు, ఉపసర్పంచ్ నంగునూరు మంజుల, పంచాయతీ కార్యదర్శి ఓరుగంటి భవాని, మండల సమైక్య అధ్యక్షురాలు కనుకు ఉమ, పేరాల సునీత, జలాల్ ,వీరబోయిన ఉమా, విజయ, బండి అజయ్ , కడియం పరమేశ్వర్ కన్నెబోయిన యాదగిరి, రాములు, శ్రీనివాస్, వార్డు సభ్యులు, నాయకులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



