స్వతంత్ర అభ్యర్థి ఇంటింటి ప్రచారం
On
విశ్వంభర, సంగారెడ్డి : జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని నల్తూరు 6వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నక్కిర్తి విష్ణువర్ధన్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.



