విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

విశ్వంభర,  హనుమకొండ: వరంగల్ జిల్లా దామెర మండలం ఊరుగొండ గ్రామ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ గురిజాల శ్రీరామ్ రెడ్డి  పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల స్టడీ మెటీరియల్ అందజేశారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా పట్టణ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా రాణించాలనే లక్ష్యంతో శ్రీరామ్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు ఇది కీలక దశ అని, ఈ సమయంలో సరైన స్టడీ మెటీరియల్ ,ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి, ఉన్నత చదువులు అభ్యసించి దేశానికి సేవ చేసే ప్రతిభవంతులుగా ఎదగాలని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వేల్పుల రాజ్ కుమార్, గండు ముఖేష్, దామసాని మనోజ్, గండు పరుశురాం,కిరణ్,సుధాకర్, ఉపాధ్యాయులు గణపతి, విజయ ప్రభ, అనిత, వసుంధర, సౌజన్య పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: