బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
On
విశ్వంభర, సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ప్రాచీన శివాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దేవాలయ అధ్యక్షులు పాలకూర్ల సతీష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు పాలకూర్ల గిరి గౌడ్, వీరమల్ల కేశవులు గుప్తా, పాలకూర్ల యాదయ్య గౌడ్ (సూర్య), ప్రధాన కార్యదర్శి సూరపల్లి జోహార్, ఆలయ పూజారి రాజమౌళి, మేకని అంజయ్య, గంగాపురం సాయి గౌడ్, అచ్చిని ప్రవీణ్, ఆర్టిస్ట్ శ్రీను, వెంకటేష్ పాల్గొన్నారు.



