మిషన్ టెన్త్ క్లాస్ కరపత్రం ఆవిష్కరణ
విశ్వంభర, నాగారం: సూర్యపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గంట మహేందర్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిషన్ టెన్త్ క్లాస్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతిభావంతుల విద్యార్థులను గుర్తించి వారికి చదువుపై శ్రద్ధ పెరిగేలా ప్రోత్సహించి వారి ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా మార్గ నిర్దేశం చేసే గొప్ప కార్యక్రమాన్ని శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ తలపెట్టిందని చెప్పారు. రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం పొందిన వారికి 5 లక్షల రూపాయల నగదు, రెండవ స్థానం పొందిన వారికి మూడు లక్షల నగదు, జిల్లా టాపర్ కు రెండు లక్షల నగదు, నియోజకవర్గ స్థాయి టాపర్ కు వారికి లక్ష రూపాయలు, మండల టాపర్ గా నిలిచిన వారికి పదివేల రూపాయలు నగదు బహుమతి నీ శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండగొర్ల ఎల్లయ్య, బోయిని లింగమల్లు, బండ గొర్ల జనార్ధన్, బొల్లం నరసయ్య, మెరుగు సోమేశ్, పాక మహేష్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.



