క్లాస్ మేట్ కు ఆర్థిక సాయం
విశ్వంభర,ఇనుగుర్తి: మండలంలోని జడ్పీహెచ్ఎస్ లో విద్యాభ్యాసం చేసిన 1988-89 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ క్లాస్ మేట్ అనారోగ్యంతో బాధపడుతున్న తూల్ల జంపయ్య కు ఆర్థిక సహాయం అందించారు. తాము చదువుకున్న ఇనుగుర్తి హై స్కూల్ లో ఉపాధ్యాయుల సమక్షంలో శుక్రవారం రూ.15,216 నగదును చెంపయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి హెచ్.ఎం ఉందట.ప్రవీణ్ మాట్లాడుతూ, మూడు దశాబ్దాల క్రింతం చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ స్నేహితుడు అనారోగ్యం బారిన పడ్డాడని ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు.దీనిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థులు పప్పుల వెంకన్న, పెద్దూరి శ్రీనివాస్, వెంకయ్య గారి లక్ష్మినారాయణ,తుమ్మ సుజాత,పబ్బోజు శ్యామల,కారంపూరి యాకాంభ్రం,బాదే హరిప్రసాద్, ఉపాధ్యాయులు సమ్మిరెడ్డి, యాకయ్య, ఉప్పలయ్య, సుదర్శన్ పాల్గొన్నారు.



