44వ వార్డులో ఇంటింటి ప్రచారం

44వ వార్డులో ఇంటింటి ప్రచారం


 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు పరిధిలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారం చేపట్టి,బిక్కుమళ్ల మంజుల ని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట 44వ వార్డ్ బి ఆర్ ఎస్ ఇంచార్జ్ చల్ల లక్ష్మీకాంత్, సవరాల సత్యనారాయణ, బండారు రాజా, పోలా రాధాకృష్ణ, తాప్సి గాంధీ, వెంపటి శబరి నాథ్ పాల్గొని వార్డ్ లోని ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. గతంలో కారు గుర్తు ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వార్డు అభివృద్ధికి బిక్కుమళ్ల మంజుల సరైన నాయకురాలు అని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే వ్యక్తిత్వం ఆమెది అని  తెలిపారు. వార్డ్ లో తాగునీటి సమస్యలు, రహదారులు, పారిశుధ్యం, కాలనీల అభివృద్ధి, పేదల సంక్షేమం వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపై బిక్కుమళ్ల మంజుల హామీ ఇచ్చారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉండే నాయకత్వం అవసరమని, అలాంటి నాయకత్వాన్ని అందిస్తారని చల్లా లక్ష్మీకాంత్ పేర్కొన్నారు.44వ వార్డుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కారు గుర్తు పనిచేస్తుందని, గత అనుభవం, ప్రజలపై అవగాహన ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బిక్కుమళ్ల మంజుల ని భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డ్ ప్రజలను కోరారు.ఈ ఇంటింటి ప్రచారానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, 44వ వార్డులో ఎన్నికల వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.

Tags: