పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత 

పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత 

విశ్వంభర,  జగద్గిరిగుట్ట : కూకట్ పల్లి   ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  మహిళా అసోసియేట్ ప్రొఫెసర్  గాంధీ హైట్స్ దగ్గర రోడ్డుపై తన హ్యాండ్ బ్యాగ్ ను పోగొట్టుకున్నారు. వెంటనే ఆమె జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.  క్రైమ్ బ్రాంచ్ విభాగం నరేందర్ రెడ్డి నేతృత్వం లో పోలీసులు ఆ బ్యాగును వెతికిపట్టుకుని బాధితురాలికి అప్పజెప్పారు. పోయిన తన బ్యాగును తిరిగి అప్పగించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Tags: