బ్రహ్మోత్సవాలకు సర్పంచ్ విరాళం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నిదానపల్లి గ్రామ పరిధిలోని మల్లన్నగుట్ట మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పదివేల రూపాయలు చందాగా ఇచ్చారు. బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల కమిటీ సభ్యులు, ఇరు గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



