''14వ వార్డు  అభివృద్ధిలో  రాజీపడం''

''14వ వార్డు  అభివృద్ధిలో  రాజీపడం''

విశ్వంబర, సదాశివపేట:  14వ   వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఉల్లిగడ్డల ఛాయా శాంతి కుమార్  ఇంటింటి ప్రచారం నిర్వయించారు. ఈ  ఎన్నికల్లో గెలిపిస్తే  ఐదేళ్లు  సేవలందిస్తానని అన్నారు. గతంలో తాను కౌన్సిలర్ గా ఉన్న సమయంలో వార్డులో మంచినీటి ట్యాంకులు నిర్మించామని ,అర్హులకు పింఛన్లు అందించామని, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించానని గుర్తు చేశారు.   ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడబోమని, పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, గల్లీల్లో కొత్త సిసి రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచారు.  14వ  వార్డును ఆదర్శ అవార్డుగా చేస్తానన్నారు.    వార్డులో ఛాయా శాంతి కుమార్ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది .

Tags: