విజ్ఞాన్ లో చిన్నారులకు అక్షరాభ్యాసం

విజ్ఞాన్ లో చిన్నారులకు అక్షరాభ్యాసం

విశ్వంభర,ఇనుగుర్తి: వసంత పంచమి పురస్కరించుకుని మండల కేంద్రం ఇనుగుర్తి లోని విజ్ఞాన్ హై స్కూల్ లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ముందుగా చదువుల తల్లి సరస్వతి దేవికి బ్రాహ్మణోత్తముని చే ప్రిన్సిపాల్ గంజి అర్చన రెడ్డి స్కూల్ టీచర్స్ తో కలిసి పూజలు చేయించారు. అనంతరం చిన్నారులకు విద్యాభ్యాస శ్రీకారం చేయించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, చదువంటే భయం కాదు భవిష్యత్తుకు మార్గం చూపే వెలుగు అని చెప్పారు. విజ్ఞాన్ హై స్కూల్లో ప్లే వే పద్ధతిలో బోధించడం వల్ల విద్యార్థులు సులభంగా, ఉత్సాహంగా, ఖచ్చితత్వంతో నేర్చుకుంటున్నారని  తెలిపారు.ఈ కార్యక్రమంలో  విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Tags: