మమ్మీ నన్ను క్షమించు 

మమ్మీ నన్ను క్షమించు 


  • సూసైడ్ లెటర్ రాసి యువతి  ఆత్మహత్య 

విశ్వంభర, ఘట్కేసర్: సభ్య సమాజం తలదించుకునేలా మేడ్చల్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 'రాజు వెడ్స్ రాంబాయి' అనే సినిమా తరహాలో ఓ ఉన్మాది చేసిన పనికి నిండు ప్రాణం బలైపోయింది   తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఒక యువతికి బలవంతంగా ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించి, ఆమె మరణానికి కారణమయ్యాడు ఒక కిరాతకుడు. మేడ్చల్ జిల్లా  పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 11వ తేదీన ఈ ఘోరం జరిగింది. నిందితుడు ఒక యువతిని పెళ్లి చేసుకోవాలని వేధించగా, ఆమె నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న ఆ యువకుడు, బాధితురాలిని బంధించి ఆమెకు బలవంతంగా హెచ్ఐవి   రక్తాన్ని శరీరంలోకి ఎక్కించాడు. ఈ చర్యతో ఆ యువతి శారీరకంగానే కాకుండా మానసికగా తీవ్ర వేదనకు గురైంది   ప్రాణాంతక వ్యాధి సోకిందన్న భయం ఆ యువతిని కుంగదీసింది. గత కొన్ని రోజులుగా మానసిక క్షోభను అనుభవిస్తున్న  రమణి ( 24)  బాధితురాలు, చివరకు  అన్నోజిగూడ లో ని  రాజీవ్ గృహకల్ప ఇంట్లో ఉరి వేసుకుని శుక్రవారం  ప్రాణాలు వదిలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని  పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి  తరలించారు.

Tags: