వేం నరేందర్ రెడ్డికి వరంగల్ నేతల శుభాకాంక్షలు
On
విశ్వంభర, హనుమకొండ: ఢిల్లీ లో వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క , ఎంపీ కడియం కావ్య , మేయర్ గుండు సుధారాణి, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డీ, కే ఆర్ నాగరాజు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని, ఆయన తన అనుభవంతో ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో సమర్థవంతంగా ప్రస్తావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ఆయన విశేషంగా సేవలందించాలని ఆకాంక్షించారు.



