వివేకానంద పార్క్ ఆవరణలో 5వ చలివేంద్రాన్ని ప్రారంభించిన గద్దె విజయ్ నేత
విశ్వంభర. ఎల్బీనగర్ :- బి.యన్.రెడ్డి డివిజన్ లోని ఎన్జీవోస్ కాలనీ వివేకానంద పార్క్ ఆవరణలో ప్రముఖ సామాజికవేత్త . మల్కాజ్ గిరి టీడీపీ అడ్ హాక్ కమిటీ సభ్యులు, బి.యన్.రెడ్డి టీడీపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో మరో చలివేంద్రాన్ని ప్రారంభించారు.వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షులు మూర్తి , ఆర్కే రామనాయుడు చేతుల మీదుగా ఈ చలివేంద్రాన్ని మజ్జిగతో ప్రారంభించారు. ఇప్పటివరకు 5 చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ,పలు ప్రాంతాలలో వారానికి ఒకరోజు మజ్జిగ పంపిణి చేస్తున్నామని గద్దె విజయ్ నేత తెలిపారు. ఎండలు ఎక్కువ అవుతున్న తరుణంలో కార్మికులు , ఉద్యోగులు , బాటసారులు , వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే గత 15 సం. రాలుగా సామజిక సేవలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న గద్దె విజయ్ నేతను స్థానిక కానీవాసులు , అతిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిడిపి సీనియర్ లీడర్ వెంకటేశ్వరరావు, అశోక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు శివ నేత, మురళి, మల్లేష్, జంగారెడ్డి, సుగుణాకర్ రెడ్డి , శ్రీరామ్, వినయ్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



