డిజిటల్ మహానాడు 2026 విజయానికి సికింద్రాబాద్ నాయకుల పిలుపు
విశ్వంభర, హైదరాబాదు : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులు ‘డిజిటల్ (జూమ్) మహానాడు 2026’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీలలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై హైదరాబాదు నగర పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ఎలా ముందుకు తీసుకెళ్లాలి, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. మే 27న జరిగే మహానాడు కార్యక్రమాలను రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నట్లు తెలిపారు. హాజరయ్యే నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ పాటిస్తూ పచ్చ చొక్కా ధరించి పాల్గొనాలని సూచించారు. మే 28న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతి డివిజన్‌లో పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు అన్నదానం, పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. నిర్వహించిన కార్యక్రమాల ఫోటోలు, వివరాలను జిల్లా పార్టీకి నివేదించాలని తెలిపారు. అదే రోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, అనంతరం సిటీ, స్టేట్ కార్యాలయాల్లో జరిగే ప్రధాన కార్యక్రమాలకు హాజరుకావాలని సూచించారు. మహానాడులో నిర్వహించే రక్తదాన శిబిరానికి ప్రతి నియోజకవర్గం నుండి కనీసం ఇద్దరు లేదా ముగ్గురు కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనేలా బాధ్యతలు తీసుకోవాలని నాయకులకు సూచించారు. సమావేశంలో శ్రీపతి సతీష్, పి. అశోక్, పి. బాలరాజు గౌడ్, నగు నగేష్, శ్యామ్ సుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్, తడక వినోద్ కుమార్, బి. వై. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.