గ్యాస్ సిలిండర్ లీక్ బాధిత కుటుంబానికి LB నగర్ ఎమ్మెల్యే  భరోసా

గ్యాస్ సిలిండర్ లీక్ బాధిత కుటుంబానికి LB నగర్ ఎమ్మెల్యే  భరోసా

విశ్వంభర, ఎల్బీనగర్ : హయత్ నగర్ డివిజన్ లోని రంగనాయకులగుట్ట బస్తీలో నివసించే కందనమోని శివకుమార్ ఇంట్లో గురువారం  రాత్రి గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  స్థానిక నాయకులు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం  ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్న హయత్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు చెన్నగొని శ్రీధర్ గౌడ్ ఇదే విషయాన్ని శ్రీధర్ గౌడ్  ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కి తెలియచేశారు. తక్షణమే స్పందించి ఎమ్మెల్యే వారి కుటుంబానికి  10,000 రూపాయల నగదు ను శ్రీధర్ గౌడ్ ,  శివకుమార్ దంపతులకు అందచేశారు.
 ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హయత్ నగర్ మండల రెవిన్యూ అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకోవాలని కూడా కోరారని డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో డివిజన్ యూత్ ప్రెసిడెంట్ డ్యాగల రాకేష్ కుమార్, బి.ఆర్.ఎస్.సీనియర్ నాయకులు పిట్టల లక్ష్మణ్ ముదిరాజ్,తొండ వెంకటేష్,రవి నాయక్,విష్ణువర్ధన్,మధు,మనోజ్,వీరన్న తదితరులు పాల్గొన్నారు.

 

Tags: