తెలంగాణపై ఎంపీ తేజస్వి వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణపై ఎంపీ తేజస్వి వివాదాస్పద వ్యాఖ్యలు

విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ డిమాండ్ చేశారు. గతంలో నరేంద్ర మోడీ కూడా తెలంగాణ ఏర్పాటుపై అవమానకర వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వేలాది మంది ప్రాణత్యాగాలు చేశారని, అలాంటి త్యాగాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అన్యాయమని అన్నారు. తెలంగాణ చరిత్ర, పోరాటాల గురించి అవగాహన లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రానికి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించడం లేదని, దీనిపై తెలంగాణ ఎంపీలు స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Tags: