డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
On
విశ్వంభర, బల్కంపేట : రోడ్డు భద్రత కోసం డ్రైవర్ల ఆరోగ్యం కీలకమని ట్రాఫిక్ ఏసీపీ డా. రవీందర్ గౌడ్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదు బల్కంపేటలో సంకర నేత్రాలయంలో ఆటో, వాటర్ ట్యాంకర్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్ నగర్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఏసీపీ పాల్గొని డ్రైవర్లతో మాట్లాడారు. డ్రైవింగ్ సమయంలో కంటి సమస్యలు ప్రమాదాలకు దారితీసే అవకాశముందని, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డ్రైవర్లలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఈ శిబిరం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ కె. మహేష్ గౌడ్,, ఎస్‌ఐలు రాంబాబు, శ్రీరాములు సిబ్బంది పాల్గొన్నారు.



