నన్నూరి నర్సిరెడ్డి నియామకంపై హర్షం
విశ్వంభర, అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నన్నూరి నర్సిరెడ్డిని నియమించడం పార్టీ బలోపేతానికి తీసుకున్న అత్యంత సమయోచిత నిర్ణయం అని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి, యువనేత నారా లోకేష్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని పార్టీ నాయకులు పేర్కొన్నారు. నన్నూరి నర్సిరెడ్డి సామాజిక అంశాలపై గట్టి పట్టుతో, ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో పార్టీ తరఫున బలమైన స్వరం వినిపిస్తారని విశ్వసిస్తున్నామన్నారు. ఆయన నియామకం ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పొందడమే కాకుండా, పార్టీ ఆలోచనలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయగలదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ నియామకం ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం, దిశ దొరికిందని అన్నారు.



