ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఆప్ ఆగ్రహం

ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఆప్ ఆగ్రహం

విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను సహించమని ఆమ్ ఆద్మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్ అన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ ప్రజల సంస్కృతి, జీవన విధానంపై తక్కువగా మాట్లాడటం అవమానకరమని పేర్కొన్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని విమర్శించారు. తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. తెలంగాణ హక్కుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

Tags: