ప్రభుత్వ ఆశయ సాధనకు కృషి చేద్దాం
- మండల సభలో అధికారులు
విశ్వంభర, నెల్లికుదురు: రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో అగ్ర గామిగా నిలపాలనే ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా గ్రామస్థాయి నుంచి ప్రజా ప్రతినిధులు అధికారులు కృషి చేయాలని తహసిల్దార్ చందనరేష్, స్పెషలాఫీసర్ మరియన్న, ఎంపీడీవో సింగారపు కుమార్ సర్పంచులకు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలఅభివృద్ధి పారదర్శకంగా అర్హులందరికీ అమలు చేయాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ఎంపీడీవో కుమార్ అధ్యక్షతన మండల కేంద్రం నెల్లికుదురు అమూల్య గార్డెన్లో గురువారం మండల స్థాయి సమావేశం జరిగింది. దీనికి హాజరై వారు దిశ నిర్దేశం చేశారు. ఎంపీడీవో కుమార్ సుదీర్ఘంగా పలు అంశాలపై మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులు చేపట్టని వారు,పూర్తి చేయని వారు మే నెల ఆఖరి వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు చెప్పారు.ఆయా శాఖల అధికారులు ఏఏ గ్రామాలలో ఏ ఏ పనులు తమ ద్వారా జరుగుతాయో తక్షణమే వాటిని పరిష్కరించాలన్నారు.అధికారులు తమ ద్వారా అందే సేవలను వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై కాకుండా స్వతంత్ర గుర్తులపై జరిగాయని ప్రతిపక్ష పార్టీల నుంచి సర్పంచులుగా గెలుపొందిన గ్రామాల అభివృద్ధిపై వివక్ష చూపవద్దని బ్రాహ్మణ కొత్తపల్లి సర్పంచి యాకాంతం గౌడ్ సూచించారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారుల ను ప్రజా పాలన సంక్షేమ పథకాలలో నమోదు చేయాలన్నారు.కాస్య తండా సర్పంచి బోడ నర్సింహ నాయక్ తమ గ్రామం తోపాటు పరిధిలోని తండాలలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని వెంటనే పరిష్కరించాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు , పంచాయతీ కార్యదర్శులు లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



