ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు 

ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు 

 విశ్వంభర, జిహెచ్ఎంసి : జంగంమ్మెట్ ప్రాంతంలో  హిందూ సమ్మేళనం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్, నాగులబండ, ముదిరాజ్ నగర్, యాదగిరి నగర్, వీరభధ్రీయ సంఘం,బుడుగజంగ సంఘం, దళిత సంక్షేమ సంఘం, ఎరుకల బస్తీ, జంగమ్మెట్, పుసల బస్తీ, ఏడుగుళ్ళు, రెడ్డి బస్తీ, గాందీనగర్ వివిధ కాలనీలకు చెందిన మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. వివిధ రంగులతో అద్భుతమైన డిజైన్లతో ముగ్గులు వేసి, సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కళాత్మకంగా అలంకరించారు. దేవతా చిత్రాలు, పూల ఆకృతులు, సంస్కృతికి సంబంధించిన చిహ్నాలతో రూపొందించిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పోటీలను వీక్షించడానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పాల్గొన్న మహిళలను అభినందించారు. కార్యక్రమం సందర్భంగా హిందూ సంప్రదాయాల పరిరక్షణ, సాంస్కృతిక విలువల ప్రాముఖ్యతపై నిర్వాహకులు మాట్లాడారు. ముగ్గుల పోటీల్లో విజేతలను ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags: