మామునూర్ ను సందర్శించిన ఏఏఐ అధికారులు 

మామునూర్ ను సందర్శించిన ఏఏఐ అధికారులు 

విశ్వంభర,  హనుమకొండ: వరంగల్ జిల్లా కలెక్టరేట్ చాంబర్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద , ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఎం. రాజా కిషోర్, రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సౌత్ రీజన్  అచింత కుమార్ దత్తా, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్  జి. నటరాజు, ఏజీఎం  ల్యాండ్ మేనేజ్‌మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు తమ సందర్శనలో పరిశీలించిన అంశాలను వివరించారు. మామునూర్ ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ, అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చిస్తూ, రన్‌వే స్థితి, టెర్మినల్ సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించి, అవసరమైన మెరుగుదలలపై   చర్చించారు.
మామునూర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ద్వారా ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి, ఆర్డిఓ వరంగల్ సుమ, ఏడి సర్వే ల్యాండ్ శ్రీనివాస్,  ఖిలా వరంగల్ తాసిల్దార్ ఇక్బాల్ సంబంధిత శాఖల అధికారులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Tags: