మాదిగ మహాయోగి కవి దున్న ఇద్దాసు

మాదిగ మహాయోగి కవి దున్న ఇద్దాసు

విశ్వంభర, చిక్కడపల్లి : సాహిత్యం, సంస్కృతితో సామాజిక సమైక్యతకు బాటలు వేసిన మహనీయుడు దున్న ఇద్దాసు అని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాశీ విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన తొలి దళిత కవిగా గుర్తింపు పొందిన ఇద్దాసు సాహిత్య, సామాజిక రంగాల్లో విశిష్ట సేవలు అందించారని అన్నారు. హైదరాబాదు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో గురువారం నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఆచార్య బిరుదురాజు రామరాజు వంటి పరిశోధకులు ఇద్దాసును ‘మాదిగ మహాయోగి’గా కీర్తించారని, సుంకిరెడ్డి నారాయణరెడ్డి వంటి చరిత్రకారులు ‘తొలి దళిత కవి’గా గుర్తించారని వివరించారు. అచల యోగిగా, సంకీర్తనకారుడిగా, తత్త్వకవిగా ప్రసిద్ధి చెందిన ఇద్దాసు అట్టడుగు వర్గాల్లో చైతన్యాన్ని పెంపొందించిన వ్యక్తిగా నిలిచారని అన్నారు. ఈ  కార్యక్రమంలో రేణుక లక్ష్మీ శాంతి, గానసభ పాలకమండలి సభ్యుడు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags: