ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై సమీక్ష
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం మార్చి 6వ తేదీ నుండి 99 రోజులపాటు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో, అర్హులైన లబ్ధిదారులకు అందరికీ ప్రభుత్వం అందించే పథకాలు అందాయా లేదా, ఒకవేళ ఎవరికైనా అందకపోతే వారికి కూడా తప్పకుండా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పురోగతిపై ప్రతి శాఖాధికారులు తమ నివేదికలను సమర్పించారు. గ్రామ సర్పంచులు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జగన్నాథ్ రావు , మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ జి. జలందర్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారి దశరథ్ నాయక్, మండల విద్యా అధికారి శ్రీ భాస్కర్, మండల పంచాయతీ అధికారి వై. ప్రేమలత, వ్యవసాయ అధికారి అంజని దేవి, వైద్య శాఖకు చెందిన డా. వేణు మాధవి , డా. జ్యోతి, డా. ఖాజా , విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ నర్సింహ, పంచాయతీ రాజ్ శాఖ సహాయ ఇంజనీర్ సందీప్ రెడ్డి. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రమ్య, ఐకేపీ అసోసియేట్ ప్రాజెక్ట్ మేనేజర్ అంజయ్య , హౌసింగ్ శాఖ ఏఈ కిరణ్ అశోక్ , పాల్గొన్నారు.



