డీలిమిటేషన్ తో  లింక్ పెట్టడం సరికాదు 

డీలిమిటేషన్ తో  లింక్ పెట్టడం సరికాదు 

విశ్వంభర, హిమాయత్ నగర్  : మహిళా రిజర్వేషన్ అమలును డీలిమిటేషన్‌కు ముడిపెట్టడం సరైంది కాదని సీపీఐ నాయకులు పద్మ తెలిపారు. మహిళా రిజర్వేషన్లను స్వతంత్రంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనగణన పూర్తయ్యాకే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, డిజిటల్ జనగణన పూర్తికాకముందే ఈ అంశంపై నిర్ణయాలు తీసుకోవడం అనుచితమని పేర్కొన్నారు. అధికారులు 2027 నాటికి జనగణన పూర్తయ్యే అవకాశం ఉందని వెల్లడించిన నేపథ్యంలో తొందరపాటు అవసరం లేదన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా అమలు చేయడానికి ప్రయత్నించడం సరికాదని, మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని సూచించారు. జనగణన అనంతరం మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని డిమాండ్ చేశారు.

🕒 17 Apr 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/linking-with-delimitation-is-not-correct/article-14096

Tags: