చేవెళ్లలో బీజేపీ నేతల జన్మదిన వేడుకలు

చేవెళ్లలో బీజేపీ నేతల జన్మదిన వేడుకలు

విశ్వంభర, చేవెళ్ల: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ సీనియర్ నాయకులు గోటురి శంకర్ గౌడ్, సందీప్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ యువనేత డాక్టర్ వైభవ్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులను గౌరవించడం ఆనందదాయకమని అన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 17 Apr 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/birthday-celebrations-of-bjp-leaders-in-chevella/article-14106

Tags: