పేద ప్రజలకు అండగా నిలిచిన మహనీయుడు వినోబా భావే
- ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
విశ్వంభర, హైదరాబాద్: భూదాన ఉద్యమానికి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భూదాన ఉద్యమ వజ్రోత్సవాల నేపథ్యంలో మూడు రోజులపాటు భూదాన ఉద్యమ స్ఫూర్తి పాదయాత్రను నిర్వాహకులు తడక యాదగిరి, పట్నం కృష్ణకుమార్ చేపట్టారు. శివరాంపల్లి నుండి భూదాన్ పోచంపల్లి వరకు సాగే ఈ పాదయాత్రకు మొదటి రోజు శివరాంపల్లి నుండి పాదయాత్రను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే పాదయాత్ర సర్వోదయ సంఘ సభ్యులు అలాగే గాంధీయవాదులు పాదయాత్ర ద్వారా ఏప్రిల్ 18న భూదాన్ పోచంపల్లికి చేరుకుంటుందని వారన్నారు. 1951 ఏప్రిల్ 16న శివరాంపల్లి నుండి ప్రారంభమై ఆనాటి భూదాన ఉద్యమ యాత్ర కొనసాగిందని గుర్తుచేశారు. భూదాన ఉద్యమ యాత్రకు శ్రీకారం చుట్టిన వినోబా బావె భూదాన్ పోచంపల్లి లో పర్యటించినప్పుడు అక్కడ భూస్వాములు అయిన వెదిరే రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూమిని దానం చేసినట్టు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే వినోబా భావే దేశవ్యాప్తంగా భూదాన ఉద్యమాన్ని చేపట్టి 44 లక్షల ఎకరాల భూమిని సేకరించడం జరిగిందని అన్నారు. అలాంటి మహోన్నత ఘట్టాన్ని ఏప్రిల్ 18 నాటికి 75 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఉద్యమ స్ఫూర్తి పాదయాత్రను ఎంచుకున్నామని నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 18న భూదాన్ పోచంపల్లి వరకు పాదయాత్ర ముగింపు కార్యక్రమం చేపడతామని అలాగే వేదిరే రామచంద్ర రెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భూదాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ తడక వెంకటేశ్వర్లు, జాతీయ బీసీ నాయకులు గుజ్జసత్యం, ది పోచంపల్లి కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ తడక రమేష్, అలాగే ప్రముఖులు భారత లవ కుమార్, అంబటి శ్రీనివాస్, చింతకింది రమేష్ తదితరులు పాల్గొన్నారు.



