18న తెలంగాణ ఉద్యమకారుల ఛలో తార్నాక 

18న తెలంగాణ ఉద్యమకారుల ఛలో తార్నాక 

విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యమకారుల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం హైదరాబాదు తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాలులో  శనివారం నిర్వహించనున్నారు. ఈ  నేపధ్యంలో ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉద్యమకారులు భారీ ఎత్తున తరలివచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని, ఈ సమావేశానికి 18వ తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తార్నాక చౌరస్తా నుండి ర్యాలీగా మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ వరకు వెళ్లి 10 గంటల నుండి ఈ సమావేశాన్ని ప్రారంభించి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని  ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రివర్యులు  పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ సినీనటి విజయశాంతి, ఉద్యమ నాయకులు కోదండరాం, మరికొందరు ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ఉద్యమకారులను గుర్తించడానికి సబ్ కమిటీని త్వరగా వేయాలని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఎంతోమంది తొలి దశ మలిదశ ఉద్యమకారులు కనుమరుగైనారని, ఇకనైనా ఈ ప్రభుత్వము స్పందించి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, 25 వేల పెన్షన్ సౌకర్యం కల్పించి, పదివేల కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డులు ఇచ్చి బస్సులలో, రైళ్ళలో ఉచిత సౌకర్యం కల్పించాలని కోరారు.

Tags: