వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
విశ్వంభర, నిజామాబాద్: ఇందల్వాయి, కోరుట్ల తండా, కేకే తండా, గ్రామాలలో ఐకెపి ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ఏపిఎం సునీత ప్రారంభించారు. ఈ సందర్బంగా సునీత మాట్లాడుతూ, రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సొసైటీల ద్వారా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధాన్యంలో తేమశాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలన్నారు. తూకం వేసి ఆన్‌లైన్ లో అప్‌లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు. ఎ గ్రేడ్ మద్దతు ధర 2389 రూపాయలు, సాధారణ రకం 2369 రూపాయలు, సన్నరకం ధాన్యంకు అదనంగా బోనస్ 500 రూపాయలు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లవెల్లి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కుంట గంగాధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్, విడిసి సభ్యుడు తిరుపతి రాజులు అధ్యక్షురాలు రజిత కార్యదర్శి రాధా సహాయ కార్యదర్శి జ్యోతి, వివో ఏ మమత, వివో ఏ, సౌమ్య, సీసీ రుద్ర మహిళా సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



