సమన్వయంతో ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చుదాం

సమన్వయంతో ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చుదాం

  • డీవో పార్థసారథి

 విశ్వంభర, ఇనుగుర్తి: ప్రభుత్వ ఆశయాలను సమష్టిగా నెరవేర్చుదామని ఎంపీడీవో పార్థసారథి సర్పంచులు, ఉప సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు పిలుపునిచ్చారు. రైసింగ్ తెలంగాణలో భాగంగా రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో అగ్ర భాగంగా నిలపాలనే ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా గ్రామస్థాయి నుంచి కృషి చేయాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఎంపీడీవో పార్థసారధి అధ్యక్షతన స్థానిక రైతు వేదికలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలఅభివృద్ధి పారదర్శకంగా అర్హులందరికీ అమలు  చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులు చేపట్టని వారు, నిర్మాణం చేస్తున్న వారు మే నెల ఆఖరి వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు చెప్పారు.ఇందుకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.ఆయా శాఖల అధికారులు ఏఏ గ్రామాలలో ఏ ఏ పనులు తమ ద్వారా జరుగుతాయో తక్షణమే వాటిని పరిష్కరించాలన్నారు.అధికారులు తమ ద్వారా అందే సేవలను వివరించారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు,స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్, మెడికలాఫీసర్ డా.సురేష్, ఎంఈఓ రూపా రాణి,ఏవో మహేందర్, వెటర్నరీ డా.రవీందర్ వివిధ గ్రామాల సర్పంచులు,ఉపసర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ఆయా శాఖల అధికారులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Tags: