పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి 

పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి 

  • కలెక్టర్ దీపక్ తివారి

విశ్వంభర, బొంరాస్ పేట్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా గురువారం మండల సభ  ఏర్పాటు చేశారు.   బొంరాస్ పేట్  మండలం రైతు వేదికలో ఏర్పాటు చేసిన మండల సభ లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పాల్గొన్నారు. మండల సభల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని  కలెక్టర్ అన్నారు. మండల సభకు అధికారులతో కలిసి హాజరై 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని అధికారుల ద్వారా చదివి వినిపించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ,  ప్రజాపాలన - ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం, అభివృద్ధి పనుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుందని, ఈ పథకాల ప్రగతి వివరాలను ప్రజలకు వివరించి పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. మండల సభల ద్వారా ఆయా ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని, సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించే దిశగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు రాయితీ గ్యాస్, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణ సదుపాయం, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వివిధ వ్యాపార రంగాలలో ప్రోత్సాహం, ఇందిరమ్మ ఇండ్లు  వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ముందుగా సంబంధిత శాఖల వారిగా ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా పలు పథకాల లబ్దిదారులు తమ అనుభవాలు, అభిప్రాయాలను వెల్లడించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై రోడ్లు , భూ సర్వే , పంచాయతీ, మండల అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్ పి సి ఇ ఓ సుధీర్ , గ్రంథాలయ ఛైర్మెన్ రాజేశ్వర్ రెడ్డి, బొంరాస్ పేట్ తహసీల్దార్ పద్మావతి, ఎం పి డి ఓ వెంకన్న గౌడ్, సర్పంచ్ విరేశం , ఏం పి ఓ రవి , జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

Tags: