వేం నరేందర్ రెడ్డి కి కాలే యాదయ్య శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డి కి కాలే యాదయ్య శుభాకాంక్షలు

విశ్వంభర, చేవెళ్ల: న్యూ ఢిల్లీలో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పార్లమెంట్ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేందర్ రెడ్డి ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి, చేవెళ్ల సహకార సంఘం మాజీ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి, ముడిమ్యాల్ మాజీ సహకార సంఘం చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, పామేనా కౌన్సిలర్ దవల్ గోపాల్ రెడ్డి, దామెరగిద్ద మాజీ సర్పంచ్ మధుసూదన్ గుప్తా, చనువల్లి సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, చేవెళ్ల మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మంగలి యాదగిరి, షాబాద్ దర్శన్ ,పడాల ప్రభాకర్, తదితర ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Tags: