మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామానికి చెందిన గంగుల శశికళ అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి గంగుల శశికళ పార్ధీవ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించినారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగుల వెంకటరెడ్డి, వార్డు మెంబర్స్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



