డీలిమిటేషన్ ప్రక్రియ ఫెడరల్ స్ఫూర్తి కి విఘాతం

డీలిమిటేషన్ ప్రక్రియ ఫెడరల్ స్ఫూర్తి కి విఘాతం

  • సిపిఐ (ఎంఎల్)  ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి

విశ్వంభర, తొర్రూరు: కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలను  వివక్షతతో చూసే విధంగా ఉందని అన్నారు. ఫెడరల్ స్ఫూర్తి కి పూర్తిగా విఘాతం కలుగుతుందని గుత్తాధిపత్యం ఏర్పడి సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కిక్కుతుందని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత భారత రాజ్యాంగంలో 131 వ అధికరణను సవరించి ఎంపిక చేయనున్నారని ఇది దక్షిణాది రాష్ట్రాలకు తీరని ద్రోహం చేస్తుందన్నారు. జనాభా నియంత్రణలో ఉత్తరాది రాష్ట్రాల కంటే చైతన్యవంతంగా దక్షిణాది రాష్ట్రాలు అమలు చేసిన కారణంగా జనాభా లెక్కల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా ప్రకారం ఉత్తరాది రాష్ట్రాలలో 38.1 శాతం నుండి 48 శాతం వరకు పెరగగా దక్షిణాది రాష్ట్రాలలో 24.3 నుండి 20.7కు తగ్గుతుందని అన్నారు. 50 శాతం పార్లమెంట్ స్థానాల పెంపు గంపగు త్తగా అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనలోని భాగమని ఆయన అన్నారు. ఉత్తర దక్షిణాది రాష్ట్రాలకు నిధులు కేటాయించే విషయంలో ఇప్పటికే వివక్షత కొనసాగుతుందని చర్చ నేపథ్యంలో పార్లమెంట్లు సీట్ల  కేటాయింపులో అదే వ్యత్యాసం కొనసాగుతుం దన్నారు. అదే ఆలోచన బలపడితే దక్షిణాది రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లో కొచ్చే ప్రమాదం ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.  కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని ఆయన అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో గతంలో మోడీ సర్కార్ తీసుకొచ్చిన సవరణ హిట్లర్ నూతన చట్టం లాంటిదేనని ఆయన గుర్తు చేశారు. దీనిపై ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఐక్యమై ఉద్యమించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఐ (ఎంఎల్) తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న, డివిజన్ నాయకులు ఊడుగుల రాములు, బూర్గుల మోష ,చింతా నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: