ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలి
- మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది
విశ్వంభర, సూర్యాపేట: స్వచ్ఛ సర్వేక్షన్ 2026లో సూర్యాపేట పట్టణానికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం కీలకమని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2026లో భాగంగా గురువారం భాస్కర్ ఇన్ బ్యాంకెట్ హాల్ లో పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. తిన్న ఆహారం వృథా కాకుండా హోటల్ యజమానులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యర్థాలను వినియోగించి బయోగ్యాస్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కోరారు.స్వచ్ఛ సర్వేక్షన్ 2026లో సూర్యాపేట పట్టణాన్ని జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు చురుకుగా పాల్గొని సూర్యాపేటకు మరొక్కసారి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు.ప్రజలు తమ ఇళ్లలో తడి, పొడి, హానికర చెత్తను వేరు చేసి ఇవ్వాలని, మురికి కాలువల్లో చెత్త వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. హనుమంత రెడ్డి మాట్లాడుతూ, 2026లో సూర్యాపేటను జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, సూచనలు, సలహాలు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ యండి షఫీ ఉల్లా, మున్సిపల్ మేనేజర్ బుచ్చి బాబు,, సానిటరీ ఇన్‌స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, డీఈ సత్యారావు,టీపీఓ సోమయ్య,జూనియర్ అసిస్టెంట్ యండి గౌసుద్దీన్, ఎస్‌ఎస్‌ఆర్ ప్రసాద్,యాదగిరి టెక్నికల్ పర్సన్ రంజిత్ కుమార్, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివ ప్రసాద్ దిలీప్ పట్టణంలోని ఫంక్షన్ హాల్ రెస్టారెంట్, హోటల్స్ యజనులు తదితరులు పాల్గొన్నారు.



