అమోద అరంగేట్రం అలరించింది

అమోద అరంగేట్రం అలరించింది

విశ్వంభర, హైదరాబాదు : భరతనాట్య కళాకారిణి అమోద కొండ అరంగేట్ర ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని డి.ఎస్.టి ఆడిటోరియంలో గీతా నృత్యాలయ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన భరతనాట్యం అరంగేట్రంలో అమోద  రెండు గంటల 22 నిమిషాల పాటు నిరాటంకంగా నృత్య ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ ప్రదర్శనతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ ప్రతినిధి వసుధా రాణి రికార్డును ధృవీకరించి మెడల్, సర్టిఫికెట్, పెన్నుతో సత్కరించారు. ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న అమోద కొండ ఐదేళ్ల వయసులోనే నృత్యాభ్యాసం ప్రారంభించి, గురువు పి. గీతా రెడ్డి వద్ద భరతనాట్యంలో కఠోర శిక్షణ పొందారు. అరంగేట్రంలో పుష్పాంజలి, అర్ధనారీశ్వర అలరిప్పు, అర్ధనారీశ్వర స్తోత్రం, జతీస్వరం, సరసిజాక్షులు శబ్దం, శంకరాభరణం జావళి తదితర నృత్యాంశాలను అభినయంతో, లయబద్ధంగా ప్రదర్శించి సభికుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ భరతనాట్య గురువు డా. పంతుల ఇందిరా హేమ, కూచిపూడి నాట్యాచార్యులు గురు వేదాంతం రాధేశ్యామ్ అమోద కొండ ప్రతిభను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో: గురువు పి. గీతా రెడ్డి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ ప్రతినిధి వసుధా రాణి, కవిత కొండ, శివకుమార్ కొండ తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/amodas-debut-was-entertaining/article-17330

Tags: