లాల్ సింగ్ తండాలో హెల్త్ క్యాంప్
On
విశ్వంభర, కుల్కచర్ల : మండల పరిధిలోని లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీ లో 99 రోజుల ప్రణాళికలు భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో 30 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి హెల్త్ క్యాంప్ నిర్వహించి హెల్త్ చెకప్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శారద, ఆశ వర్కర్ అంజమ్మ, తండా వాసులు గోపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.



