ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత 

ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత 

  • ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు

విశ్వంభర,  షాద్ నగర్: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించి, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, శంకర్‌పల్లి ,  మొయినాబాద్ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ చర్యల ద్వాcరా ఎన్నికల సమయంలో అక్రమ కార్యకలాపాలను అరికట్టి, ప్రజలకు భద్రతతో కూడిన ప్రశాంత వాతావరణాన్ని కల్పించడమే లక్ష్య మని కమిషనర్ తెలిపారు.

Tags: