ఘనంగా కవియిత్రి మొల్లమాంబ జయంతి.
On
విశ్వంభర, నార్కెట్ పల్లి: కుమ్మర సంఘ భవనం, నార్కట్పల్లి నందు కుమ్మర్ల ఆడపడుచు, కవయిత్రి మొల్లమాంబ జయంతి ఘనంగా నిర్వహించినారు . తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాధారపు బిక్షపతి, నార్కెట్పల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి మాసంపల్లి సైదులు, మండల కోశాధికారి మిడిదొడ్డి రాజు, పట్టణ నాయకులు రాధారపు దేవయ్య, బండారు సత్యనారాయణ, నిమ్మనగోటి శివశంకర్, మాసంపల్లి సురేందర్, రాధారపు సైదులు తదితరులు పాల్గొన్నారు.