ఓటు హక్కు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

విశ్వంభర, ముషీరాబాదు : ప్రజాస్వామ్యానికి ఓటే పునాది, ప్రతి  ఓటరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) సర్వేకు పూర్తి సహకారం అందించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన ప్రధాన కార్యదర్శి మందాడి అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు. హైదరాబాదు ముషీరాబాదు డివిజన్ 169వ వార్డులో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హ ఓటరు తన వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని సర్వేకు సహకరించాలని కోరారు. ఓటరు జాబితాలో సరైన వివరాలు నమోదు కావడం వల్ల ప్రతి పౌరుడు తన రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత ఫారాలను పూర్తి చేసి అధికారులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లింగాల శ్రీకాంత్ గౌడ్, బూత్ లెవెల్ ఏజెంట్ అబ్దుల్ ముబీన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో: సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆరిఫ్ కార్యదర్శి రషీదుద్దీన్ బీఎల్‌ఏ మహమ్మద్ అఫ్రోజ్ మహమ్మద్ నబీ హసన్ ఇర్ఫాన్ భాయ్ వై.పీ. రాజు హాజీం భాయ్ మొయిజ్ తదితర బీఎల్‌ఏలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/everyone-should-contribute-to-the-protection-of-the-right-to/article-17732

Tags: