గుండాల మండలంలో రోడ్డు ప్రమాదం

గుండాల మండలంలో రోడ్డు ప్రమాదం

  • .. ఒకరు మృతి, మహిళకు గాయాలు

విశ్వంభర, గుండాల: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని రామారం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా, ఓ మహిళ గాయపడింది. గుండాల పోలీసుల కథనం ప్రకారం.. రామారం గ్రామానికి చెందిన కొత్తోజు రాజయ్య (65) తన బంధువైన తుపాకుల అనిత తండ్రి మరణించడంతో ఆమెను పరామర్శించేందుకు జూలై 1న  సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లాడు. అనంతరం ఇద్దరూ అనిత ఇంటి ముందు ఉన్న సీసీ రోడ్డుపై మాట్లాడుకుంటుండగా, అక్కడ నిలిపి ఉన్న మారుతి 800 కారును పక్కకు పెట్టాలని అనిత, బింగి నగేష్‌ను కోరింది. డ్రైవర్ బింగి నగేష్ కారును వెనక్కి తీస్తూ నిర్లక్ష్యంగా నడపడంతో రాజయ్య, అనితలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాజయ్య తలకు తీవ్ర గాయమై తీవ్ర రక్తస్రావం కాగా, అనితకు వెన్ను, ఛాతి భాగాల్లో గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు రాజయ్యను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన అనిత ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతుడి కుమారుడు కొత్తోజు శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుండాల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎం. శోభన్ బాబు తెలిపారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/road-accident-in-gundala-mandal/article-17730

Tags: