ఓటర్ జాబితా ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలి

  •  మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ రాములు

విశ్వంభర, పరిగి: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ  కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రాములు పాల్గొన్నారు. పరిగి మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రాములు ఇంటింటి కి ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్ రాములు మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా,నిర్వహించేందుకు గ్రామస్తులు బీఎల్‌ఓ లకు సహకరించాలని కోరారు. బీఎల్‌ఓ లు ప్రతి ఓటరు ఇంటిని సందర్శించి వివరాలను సేకరించి అవసరమైన వివరాలను నమోదు చేస్తారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒకరు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ విజయవంతానికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ వో శ్రీనివాస్, బి ఎల్ ఏ లు సుధాకర్ రెడ్డి, ముస్తఫా, కాంగ్రెస్ నాయకులు కిష్టయ్య, బందయ్య, రాములు, యూసుఫ్, తదితరులు  పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-voter-list-process-should-be-conducted-efficiently/article-17403

Tags: