సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి: డా. రాజేందర్ రెడ్డి

విశ్వంభర, తొర్రూరు: లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ సమాజానికి మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు అందించాలని లయన్స్ క్లబ్ జిల్లా పూర్వ గవర్నర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రముఖ వైద్యులను, చార్టర్డ్ అకౌంటెంట్ జంగాల రమ్యను శాలువాలతో సత్కరించి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు అందజేశారు. ప్రభుత్వ ఆయుష్ ఆస్పత్రి ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడంతో పాటు, లయన్స్ భవన్‌లో మొక్కలు నాటి, డాక్టర్ రామనరసయ్య ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నాళ్ల కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి పారిపల్లి శ్రావణ్ కుమార్‌తో పాటు క్లబ్ సభ్యులు, పూర్వ అధ్యక్షులు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dr-rajender-reddy-should-undertake-extensive-service-programs/article-17774

Tags: