సబ్సిడీ "జీలుగ"లను సద్వినియోగం చేసుకోవాలి

సబ్సిడీ

విశ్వంభర, ఇనుగుర్తి: ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఇనుగుర్తి, చీన్య తండా సర్పంచులు తమ్మడపల్లి కుమార్ జాటోత్ హరిచంద్ నాయక్ సంయుక్తంగా రైతులకు సూచించారు. కర్షకులకు ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న జీలుగు విత్తనాలను ఇనుగుర్తి మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో సర్పంచిలు కుమార్,హరిచంద్ నాయక్ కర్షకులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూసారాన్ని పెంపొందించడంలో ఉపయోగపడే పచ్చి రొట్టె ఎరువుల వినియోగం పెంచాలనే ఉద్దేశంతో రాయితీలో జీలుగ విత్తనాలు ప్రభుత్వం అందిస్తోందన్నారు. వీటిని ప్రస్తుత తరుణంలో తమ భూములలో విత్తుకొని సారాన్ని పెంచుకోవాలన్నారు.30 కేజీల విత్తనాల బస్తా రూ.2452కు లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొట్టం రాము, వార్డు సభ్యులు దేవులపల్లి వెంకటేశ్వర్లు,ఆగ్రోస్ నిర్వాహకులు ఐలయ్య రైతులు పాల్గొన్నారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/subsidy-should-be-taken-advantage-of/article-16350

Tags: