29తేదీన క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్ టెస్ట్

  • - మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచన
    మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు 

విశ్వంభర,  సిద్దిపేట: ఈనెల 29వతేదీ జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో హైదరాబాద్ సింధూ క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని ఆలస్యం చేయడమే ప్రమాదమన్నారు. ముందస్తు పరీక్ష మీ ప్రాణానికి రక్ష.. ఒక్క రోజు సమయం తీసుకుని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుని జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్పారు. ఒక్కోసారి ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవు కానీ స్క్రీనింగ్ టెస్ట్‌లో ఆ లక్షణాలు బయటపడతాయన్నారు. 40ఏళ్లు దాటిన ప్రతీ మహిళ ఈ శిబిరానికి హాజరు కావాలని, అందుకు కుటుంబసభ్యులు ప్రోత్సహించాలని సూచించారు. గర్భాశయ, రొమ్ము క్యాన్సర్‌లతో చాలామంది మహిళలు బాధపడుతున్నారని, దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి ప్రధాన కారణం లక్షణాలను నిర్లక్ష్యం చేయడమేనన్నారు. మీరు ఎక్కడికో వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదని, హైదరాబాద్ మహానగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులనే మన సిద్దిపేటకు తీసుకొస్తున్నామని చెప్పారు. గతంలోనూ కార్పొరేట్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా కొంతమందికి లక్షణాలు ఉన్నట్టుగా తేలాయని చెప్పారు. అప్పటికప్పుడు వారు చికిత్స ప్రారంభించడంతో ప్రాణాలతో బయటపడ్డారని గుర్తుచేశారు. మహిళల ప్రాణాలను రక్షించామనే తృప్తి ఉందన్నారు. ఈనెల 29తేదీన ఉదయం 9గంటల నుంచి 4గంటల వరకు టెస్ట్‌లు ప్రారంభమవుతాయని, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cancer-free-screening-test-on-29th/article-19899

Tags: