జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తో ప్రజల ఆరోగ్యానికి ముప్పు
విశ్వంభర, జవహర్‌నగర్ : హైదరాబాదులోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. ప్రభుత్వం వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాముగౌడ్ డిమాండ్ చేశారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల స్థానికులు శ్వాసకోశ, చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. గాలి, భూగర్భ జలాల కాలుష్యంతో ప్రజల జీవనం దుర్భరంగా మారిందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని కోరారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు గాలి, నీటి కాలుష్యంపై స్వతంత్ర అధ్యయనం చేసి నివేదికను వెల్లడించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం, మెరుగైన వైద్య సేవలు, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. జవహర్‌నగర్ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తుందని బుర్ర రాముగౌడ్ తెలిపారు.